డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే
శ్రీకాకుళంలో డయేరియా వ్యాధితో బాధపడుతున్న ప్రజలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే శంకర్ బుధవారం పర్యటన చేపట్టారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ, బాధితులకు ధైర్యం చెప్పారు. దమ్మలవీధిలోని సిమ్మన హాస్పిటల్, మంగువారి తోట ప్రాంతం, అలాగే రిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.