నూతన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ

TPT: వాకాడు మండలం తిరుమూరు గ్రామంలో ప్రభుత్వ ప్రవేశపెట్టిన నూతన రేషన్ స్మార్ట్ కార్డులను సోమవారం ఉదయం లబ్ధిదారులకు తిరుపతి జిల్లా తెలుగు యువత అధికారి ప్రతినిధి కుంచం దయాకర్ పంపిణీ చేశారు. కాగా, ఈ పంపిణీలో తిరుమూరు వీఆర్ హరిబాబు, వీఆర్ఎ కామేశ్వరమ్మ, చౌకధర డిపో డీలర్ పామంజి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.