దారుణం.. ఇంటికి పిలిచి హత్య

దారుణం.. ఇంటికి పిలిచి హత్య

SRD: యువకుడిని కొట్టి హత్య చేసిన ఘటన పటాన్ చెరులో జరిగింది. శివ అనే యువకుడు నగరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. కొన్నేళ్లుగా బీరంగూడకు చెందిన ఓ యువతిని ప్రేమించినట్లు, ఆ యువతి విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా, పెళ్లి విషయం మాట్లాడాలని శివను ఇంటికి పిలిపించి క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.