ప్రజల నుంచి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే
BPT: పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సోమవారం ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఆయన స్థానిక ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యం అని, ప్రతి వినతి పత్రాన్ని తీర్చడానికి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తానని చెప్పారు. పర్చూరు నియోజకవర్గాన్ని ఒక మోడల్ అభివృద్ధి ప్రాంతంగా మార్చే దిశగా ప్రజల మద్దతుతో అభివృద్ధి చేస్తామని చెప్పారు.