కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ డీకే అరుణ

MBNR: ఢిల్లీలోని పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఎంపీ డీకే అరుణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, పలు అంశాలపై చర్చించామని ఆమె తెలిపారు. అలాగే స్థానిక ఎన్నికల గురించి, అనేక ముఖ్యమైన అంశాలపై వివరణాత్మక చర్చ జరిపినట్లు ఆమె పేర్కొన్నారు.