విదేశాల్లో ఆదరణ పొందుతున్న జిల్లా హస్తకళ
W.G: నరసాపురం పేరు వినగానే గుర్తొచ్చేది క్రోషా అల్లికలు. 150 ఏళ్ల క్రితం స్కాటిష్ మిషనరీలతో ప్రారంభమైన ఈ హస్తకళ నేడు వేలాది మహిళలకు ఉపాధినిస్తోంది. కేవలం చిన్న సూది, దారంతో అద్భుతమైన డిజైన్లను సృష్టించడం ఇక్కడి మహిళల ప్రత్యేకత. ఇక్కడ తయారయ్యే టేబుల్ క్లాత్స్, దుస్తులు, గృహ అలంకరణలు USA, యూరప్ దేశాలకు భారీగా ఎగుమతి అవుతాయి. ఈ అల్లికలకు GI ట్యాగ్ లభించడం జిల్లాకే గర్వకారణం.