నిత్య అన్నదానానికి రూ. లక్ష విరాళం
NTR: ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గమ్మ ఆలయంలో జరుగుతున్న నిత్య అన్నదాన పథకానికి విజయవాడ భారతినగర్‌కు చెందిన కే. సతీశ్ కుమార్ కుటుంబ సభ్యులు బుధవారం విరాళం అందజేశారు. అన్నదానం నిమిత్తం రూ. 1,00,116 చెక్కును ఆలయ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా దాతల కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటాన్ని ఈవో శీనా నాయక్ అందజేశారు.