మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

KRNL: ఆదోని పట్టణం శుక్రవారంపేటకు చెందిన బోయ దుర్గప్ప (43) మద్యానికి బానిసై ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కూలీగా పనిచేస్తున్న అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ సభ్యులు మద్యం మాన్పించే ప్రయత్నం చేసినా విఫలమైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి దుర్గప్ప మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.