గంపలగూడెంలో 300 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం

గంపలగూడెంలో 300 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం

NTR: గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో అక్రమంగా నిలవచేసిన 300 బిస్తాల రేషన్ బియ్యాన్ని తాసిల్దార్ రాజకుమారి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తునికిపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి కోళ్ల మేత కోసం నిలవ చేసినట్లు గుర్తించామన్నారు. అతనిపై 6ఏ కేసు నమోదు చేసినట్టు తెలిపారు.