డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు

కృష్ణా: మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ర్యాగింగ్, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి కే.వీ. రామకృష్ణ మాట్లాడుతూ.. ర్యాగింగ్‌లో పాల్గొంటే జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు. మత్తుపదార్థాల వాడకం యువత భవిష్యత్తు చెడగొడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.