స్టార్ హీరోయిన్ ఇంటికి బాంబు బెదిరింపు
ప్రముఖ నటి త్రిష నివాసానికి మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న ఆమె నివాసంలో పోలీసులు, బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో ఇది నకిలీ బెదిరింపుగా పోలీసులు తెలిపారు. కాగా, త్రిషకు బాంబు బెదిరింపు రావడం ఇది నాలుగో సారి.