నిబద్ధతతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది: ఎమ్మెల్యే
E.G: రాజానగరం మండలం పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో బుధవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీని ఒక పండుగలా నిర్వహిస్తోందన్నారు. నిబద్ధతతో ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు.