VIDEO: ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
SKLM: ఎచ్చెర్ల మండలం సంత సీతారాంపురం పంచాయతీలో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటరీ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ గాలి వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.