లైసెన్స్ లేని 8 స్పా సెంటర్లపై దాడులు

HYD: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లోని 8 లైసెన్స్ లేని స్పా సెంటర్లపై పోలీసులు సమాచారంతో దాడులు నిర్వహించారు. ఎనిమిది స్పా సెంటర్ల యజమానులు, సిబ్బంది, కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు యజమానులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్నవారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.