CMRF చెక్కులు అందజేసిన రితిష్ రెడ్డి

KDP: బద్వేలులోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఇంఛార్జ్ రితిష్ రెడ్డి శనివారం పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.