'ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి'
PPM: కురుపాం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే ఉన్న జియ్యమ్మవలస, కొమరాడ విద్యార్థులకు ఉపయోగమన్నారు.