టీమిండియాకు పాకిస్తాన్ షాక్
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో టీమిండియాకు పాకిస్తాన్ షాక్ ఇచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 136 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పాక్ 13.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లలో సూర్యవంశీ (45), నమన్ ధీర్ (35) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కాగా, పాక్ బ్యాటర్లలో సదఖత్ 79 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.