VIDEO: చంద్రగ్రహణం అనంతరం మల్లికార్జున ఆలయంలో శుద్ధి
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ద్వారబందం చేశారు. గ్రహణం ముగిసిన అనంతరం సాయంత్రం ఆలయ అర్చకులు దేవాలయాన్ని శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం ప్రాంగణం శుభ్రపరిచారు. బుధవారం సంప్రోక్షణ, అభిషేక పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈవో సుధాకర్ తెలిపారు.