పాడేరు-విశాఖకు యథావిధిగా బస్ సర్వీసులు
ASR: పాడేరు డిపో నుంచి విశాఖకు యథావిధిగా బస్ సర్వీసులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి పి.శ్రీనివాస్ రావు గురువారం తెలిపారు. ప్రజల రద్దీని దృష్టిలో పెట్టకుని బస్ సర్వీసులు ఉంటాయన్నారు. కాకినాడ, రాజమండ్రి, భద్రాచలం బస్ సర్వీసులు నిలుపుదల చేసినట్లు చెప్పారు. లైన్ క్లియర్‌గా ఉంటే తర్వాత ఆయా రూట్లకు బస్ సర్వీస్ సేవలు అందిస్తామని ఆయన వెల్లడించారు.