'మార్కెట్ కమిటీ అభివృద్ధికి నిధులు మంజూరు'

KMR: మార్కెట్ కమిటీ అభివృద్ధికి 2.34 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ మారెడ్డి రజిత వెంకటరామిరెడ్డి తెలిపారు. కొత్తగా మార్కెట్ కమిటీ కార్యాలయ నిర్మాణానికి రూ.86.80 లక్షలు, 10 వాణిజ్య సముదాల నిర్మాణానికి రూ.83.80 లక్షలు, ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.18.80 లక్షలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ .13 లక్షల మంజూరు అయ్యాయి.