VIDEO: పెట్రోల్ బంక్ పేరుతో మోసం.. నలుగురు అరెస్ట్
జనగామ జిల్లా కేంద్రంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, పెట్రోల్ బంకులు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల నుంచి లక్షలు వసూలు చేసిన నలుగురిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ చేతన్ తెలిపారు. ప్రధాన నిందితుడు శివకుమార్ రాజకీయ నాయకుల పరిచయాలు ఉన్నట్టు నమ్మబలికగా, శ్రీనివాస్, సాయి చరణ్, రాజేష్ కలిసి మోసాలకు పాల్పడ్డారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు.