VIDEO: పామూరులో బస్సు, లారీ ఢీ.. తప్పిన ప్రమాదం
ప్రకాశం జిల్లా, పామూరు మండలం రావిగుంటపల్లి టోల్ ప్లాజా వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో నియంత్రణ సాధించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాద ఘటనలో డ్రైవర్ సహా కొంతమంది ప్రయాణీకులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.