పుష్కరిణిలో కాళ్లు కడుక్కున్న వ్లాగర్

పుష్కరిణిలో కాళ్లు కడుక్కున్న వ్లాగర్

కేరళలోని గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ పుష్కరిణిలో హిందూయేతర మహిళా వ్లాగర్ జాస్మిన్ జాఫర్ కాళ్లు కడుక్కుంటూ వీడియో చిత్రీకరించడం వివాదానికి దారితీసింది. ఇది ఆలయ ఆచారాలను ఉల్లంఘించడమేనని దేవస్వం బోర్డు తెలిపింది. దీంతో ఆలయ దర్శనాలను నిలిపివేసి పుణ్యహకర్మ నిర్వహించారు. ఆలయ పవిత్రతను ఉల్లంఘించారంటూ ఆమెపై ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.