పెంపుడు కుక్క కాటు.. రేబిస్‌తో యువకుడు మృతి

పెంపుడు కుక్క కాటు.. రేబిస్‌తో యువకుడు మృతి

ATP: శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని దేమకేతేపల్లి యువకుడు విశ్వనాథ్ రేబిస్ కారణంగా గురువారం చికిత్స పొందుతూ మరణించాడు. పది రోజుల క్రితం ఇంటి కుక్క కరవడంతో మొదట నిర్లక్ష్యం చేసిన విశ్వనాథ్‌కు, ఆరోగ్యం క్షీణించాక టీకాలు వేశారు. అయితే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడని సమాచారం.