VIDEO: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

VIDEO: గంజాయి విక్రయిస్తున్న  ఇద్దరు అరెస్ట్

NLR: జిల్లాలో గంజాయి సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తాజాగా కొడవలూరు మండలం జాతీయ రహదారిలోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో గండవరం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో వారి వద్ద నుంచి 7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి కేసులో శిక్షలు కఠినంగా ఉంటాయని సీఐ సురేంద్రబాబు తెలిపారు.