మీనాక్షి నటరాజన్‌తో కిషన్ నాయక్ భేటీ
VKB: ఏఐసీసీ పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ పిలుపు మేరకు డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్ గురువారం హైదరాబాద్‌లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తాజా పరిస్థితి, స్థానిక సంస్థల ఎన్నికల విషయాలపై మీనాక్షి నటరాజన్ అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కిషన్ నాయక్‌కు ఆమె సూచించినట్లు తెలిసింది.