వైసీపీపై ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మండిపాటు
NTR: వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిందని, జగన్ అభివృద్ధిని విస్మరించి కేవలం రాజకీయం కోణంలోనే చూశారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. శనివారం జరిగిన అసెంబ్లీ సభలో ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానుల పేరుతో నాటకమాడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. గత ఐదేళ్లలో ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేదని, వైసీపీ సమాజానికి అత్యంత హానికరమన్నారు.