ఈనెల 22న లక్షెట్‌పేటలో జాబ్ మేళా
MNCL: లక్షెట్టిపేటలో ఈనెల 22న నిర్వహించనున్న జాబ్ మేళాను విజయవంతం చేయాలని మాజీ DCC అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పిలుపునిచ్చారు. BEETSL ప్రైవేట్ లిమిటెడ్, GVK బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళా వాల్ పోస్టర్‌ను ఆమె విడుదల చేశారు. SSC, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశమని, హైదరాబాద్ నుంచి సుమారు 50 కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు.