అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్: ఎమ్మెల్యే

ELR: కూటమి ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయడం జరుగుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిశారు. ప్రజా సమస్యలపై వినతులను ఎమ్మెల్యే స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.