తహశీల్దార్ కార్యాలయం ముట్టడి

NLG: పింఛన్ దారులు చిట్యాల తహశీల్దార్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు రూ.6 వేలు, ఇతరులకు రూ. 4 వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీస్ జిల్లా కోశాధికారి తుమ్మల లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షుడు చిరగొని యాదయ్య, జిల్లా నేత వేలుపల్లి మధు పాల్గొని తహశీల్దారు కృష్ణ నాయక్‌కు వినతి ఇచ్చారు.