VIDEO: హనుమాన్ జంక్షన్‌లో పోలీసులు తనిఖీలు

కృష్ణా: బాపులపాడు మండలం H.జంక్షన్ బస్టాండ్‌లో ఆకతాయి యువకులను అదుపు చేసేందుకు ఎస్సై సురేష్ సోమవారం తన సిబ్బందితో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఖాళిగా ఉన్న యువకులను హెచ్చరించారు. నాలుగు రోడ్ల కూడలిలో వాహనాలు తనిఖీ చేసి పత్రాలు లేనివారికి జరిమానాలు విధించారు. దొంగతనాల నివారణకు కొంతమంది అనుమానితుల ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.