జిల్లాలో భానుడి భగభగలు
NGKL: జిల్లాలో భానుడి భగభగలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు ప్రకటించారు. అత్యధికంగా తిమ్మాజిపేట మండలంలో 36.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఊర్కొండ, పెద్దకొత్తపల్లి మండలాల్లో 36.0°C, అచ్చంపేట మండలంలో 35.9°C, కొల్లాపూర్, తాడూర్ మండలాల్లో 35.8 °C డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.