అంబులెన్స్‌లో మహిళా ప్రసవం

అంబులెన్స్‌లో మహిళా ప్రసవం

NRPT: దామరగిద్ద మండలం ఉడుములగిద్ద గ్రామానికి చెందిన అనసూయ శుక్రవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈఎంటీ మహమ్మద్ తాజుద్దీన్, పైలట్ వెంకటేష్ సకాలంలో స్పందించి, తగిన చర్యలు తీసుకోవడంతో ప్రసవం సురక్షితంగా జరిగింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వారు తెలిపారు.