VIDEO: రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

VIDEO: రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

WGL: వరంగల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ సమీపంలో సుమారు 55 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఇంతేజార్ గంజ్ పోలీసులు తెలిపారు. గత రెండు నెలలుగా అక్కడే భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం MGM ఆసుపత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు వెంటనే ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలన్నారు.