జిల్లా ఎస్పీ పదవి బాధ్యతలు

W.G: జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన అద్నాన్ నయీమ్ అస్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అదనపు ఎస్పీలు భీమారావు మరియు రవికుమార్ ఆయనకు పుష్పగుత్యం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా నియంత్రించడానికి మరియు మహిళల రక్షణకు, పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.