అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్య నారాయణ బుధవారం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం సక్రమంగా అందాలని ఆయన సూచించారు. ఆహార పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం నూతన యాప్‌ను ప్రవేశపెట్టిందని, దీని ద్వారా పారదర్శకత పెరుగుతుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు.