ఎల్లనూరులో మద్యం దుకాణం సీజ్

ఎల్లనూరులో మద్యం దుకాణం సీజ్

ATP: ఎల్లనూరులోని ఓ మద్యం దుకాణాన్ని ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ మద్యం దుకాణం నుంచి బ్లాక్ మార్కెట్‌లో విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. మండల పరిధిలోని బుక్కాపురం గ్రామంలో గతంలో మద్యం స్వాధీనం చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాడిపత్రి ఎక్సైజ్ పోలీసులు మద్యం దుకాణాన్ని సీజ్ చేసినట్లు శుక్రవారం తెలిపారు.