కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన కారు.. తీవ్ర గాయాలు

కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన కారు.. తీవ్ర గాయాలు

SRPT: నాగారం మండల కేంద్రంలోని సూర్యాపేట – జనగాం జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. జనగాం నుంచి సూర్యాపేట వైపు వెళుతున్న ఓ కారు అతీవేగంతో పోలీసులను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ కమలాకర్‌‌తో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.