VIDEO: దేవుని కడప ఆలయానికి భక్తుల తాకిడి

KDP: దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నిత్య కైంకర్యాలు నిర్వహించి స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి దర్శనానికి సుమారు గంట సమయం పడుతుంది. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.