‘ఆవు పేడతో దాడి ప్రజాగ్రహానికి నిదర్శనం’

‘ఆవు పేడతో దాడి ప్రజాగ్రహానికి నిదర్శనం’

బీహార్ Dy. CM విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్‌పై జరిగిన దాడిపై కాంగ్రెస్ నేత హరీష్ రావత్ స్పందించారు. కాన్వాయ్‌పై ఆవు పేడ విసరడం అనేది అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా NDA మంత్రులు, నాయకులను ప్రజలు తరిమికొట్టారని చెప్పారు. ప్రజాగ్రహం ఎంతలా ఉందో ఈ ఘటనలు తెలియజేస్తున్నాయని రావత్ తెలిపారు.