ఒక్కరోజులోనే బాసరలో 607 అక్షరాభ్యాసాలు

NRML: నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సెలవు రోజు, శుభ దినం కావడంతో దర్శించుకునేందుకు ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామున నుంచే గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం, అక్షరాభ్యాసాల కోసం బారులు తీరారు. 607 అక్షరాభ్యాసాలు జరిగాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.