నేడు కలెక్టరేట్‌లో వినతుల స్వీకరణ

నేడు కలెక్టరేట్‌లో వినతుల స్వీకరణ

GNTR: కలెక్టరేట్‌లో ఎస్.ఆర్. శంకరన్ హాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిలోనూ ప్రజల నుంచి అర్జీలు తీసుకొంటారన్నారు. ప్రజలు వారి సమస్యలపై అధికారులను కలిసి వినతులు అందించవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.