చెరువులో స్నానానికి దిగి యువకుడు మృతి

చెరువులో స్నానానికి దిగి యువకుడు మృతి

కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కుగ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుగ్రామానికి చెందిన హర్ష అనే యువకుడు అక్కను చూసేందుకు ఏలూరు జిల్లా నూజివీడులోని మీర్జాపురానికి వెళ్లాడు. అక్కడ ఉన్న చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.