కుమార్తె కనబడడం లేదని తల్లి ఫిర్యాదు

కృష్ణా: కుమార్తె కనబడకపోవడంపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాయకాపురానికి చెందిన ఎస్తేర్ రాణి ఈ నెల 3వ తేదీ నుంచి కనబడడం లేదని, అన్నిచోట్ల గాలించిన ఫలితం లేదన్నారు. దీంతో నున్న పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణమోహన్ ఆదివారం తెలిపారు.