తల్లిని చంపి బిడ్డను తీశారు: ఎంపీ సురేష్
TG: విభజన తీరుపై BJP తరుచుగా విమర్శలు చేస్తోందని MP సురేష్ రెడ్డి మండిపడ్డారు. తల్లిని చంపి బిడ్డను తీశారని.. దీనిపై సమాధానం చెప్పాల్సిన సమయమిదని నిలదీశారు. రాష్ట్రాలు వేరైనా అన్నదమ్ముల్లా కలిసి ఉందామని KCR అన్నారని.. అమరావతికి KCR మద్దతు తెలిపారని చెప్పారు. దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలబెట్టామని.. కేంద్రం సాయం లేకుండానే కాళేశ్వరం పూర్తి చేశామని చెప్పారు.