సఖి వన్ స్టాప్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

సఖి వన్ స్టాప్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రకాశం: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సఖి వన్ స్టాప్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలకు న్యాయ, వైద్య మరియు మానసిక సహాయం అందించే ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరమని, మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.