నూతన కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ

నూతన కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ

గద్వాల: జిల్లా అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణలో అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో ముందుకెళ్లాలి అని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు. శనివారం గద్వాల ఐడీఓసీ కార్యాలయంలో నూతన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.