ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
అన్నమయ్య: రాయచోటిలోని ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు తాత్కాలిక, గెస్ట్ ఫ్యాకల్టీ కింద నియామకాలు చేపట్టామని పాఠశాల ప్రిన్సిపల్ S. ఆయేషా భాను మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో 5 నుంచి 10 తరగతి వరకు బోధించుటకు గణితం, సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె కోరారు.