55 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

SRPT: తిరుమలగిరిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 1969-1970లో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 55 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఒకరికొకరు వారి సుఖసంతోషాలను పంచుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషకరమని చిన్ననాటి జ్ఞాపకాలను స్నేహితులు గుర్తు చేసుకున్నారు.