ఉల్లిపాయలతో బోలెడు ప్రయోజనాలు
హైబీపీని తగ్గించడంలో ఉల్లిపాయలు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకుగానూ ఉల్లిపాయ రసం, తేనెను ఒక టీస్ఫూన్ చొప్పున తీసుకుని రోజూ ఉదయం, సాయంత్రం తాగాలి. దీంతో రక్త సరఫరా మెరుగుపడుతుంది. బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి మేలు జరుగుతుంది. భోజనంలో భాగంగా పచ్చి ఉల్లిపాయను 30 గ్రాముల మోతాదులో తింటుండాలి. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.